సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ

సంక్రాంతి, ఉగాది పండుగల సమయాల్లో ఆటలకు అనుమతిని ఇవ్వండి

అమరావతి: సీఎం జగన్ కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎడ్లు, గుర్రం, కోడిపందేలు వంటివాటిని నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో గుర్రం, కోడి పందేలు, ఎడ్లు బరువు లాగే పోటీలు తదితర కార్యక్రమాలను ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని చెప్పారు.

అయితే, పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత చివర్లో అనుమతిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజుల పాటు అన్ని ఆటలకు పూర్తి స్థాయిలో అనుమతులను ఇవ్వాలని, పండుగల సంతోష సమయాల్లో జనాలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎంను ముద్రగడ కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/