భారీ ఊరేగింపుతో విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం

ప్రతి ఏటా తెలంగాణ నుంచి ఇంద్రకీలాద్రికి బోనాలు
బోనం తలకెత్తుకున్న జోగిని విశా క్రాంతి

telangana-bonam-offered-to-vijayawada-kanakaduramma

హైదరాబాద్‌: తెలంగాణలో బోనాల సీజన్ మొదలైంది. ప్రతి ఏటా తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామాతకు ఆనవాయతీ ప్రకారం తెలంగాణ నుంచి బంగారు బోనం తీసుకువచ్చారు. హైదరాబాద్ మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు భారీ ఊరేగింపుతో వచ్చి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణ కళాకారులు పాల్గొన్నారు. జోగిని విశా క్రాంతి బోనాన్ని తలపై మోశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/