జగన్‌ ప్రభుత్వంపై లోకేశ్‌ విమర్శలు

ఏపిలో ముస్లిం మైనారిటీల‌పై దాడుల‌కు అంతే లేకుండా పోయింది

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత లోకేశ్ సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ జగన్. అడ్డంగా న‌రికేసి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు చేయ‌డం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి అల‌వాటుగా మారింది. నంద్యాల‌లో ముస్లిం మైనారిటీ అబ్దుల్ స‌లాం కుటుంబాన్ని వెంటాడి హింసించి సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసి… ఇప్పుడు ప‌రిహారం ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌రెడ్డి గారు. బంగారు భ‌విష్య‌త్తు గ‌ల 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు కలందర్ ని మీ 25 లక్షల రూపాయలు వెనక్కి తీసుకొస్తాయా జగన్ రెడ్డి గారూ? ఏపిలో ముస్లిం మైనారిటీల‌పై దాడుల‌కు అంతే లేకుండా పోయింది ‘శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గారిని మండ‌లిలోనే ఘోరంగా అవ‌మానించిన స‌ర్కారు ఇది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్ ఎస్పీ కార్యాల‌యం ఎదుటే ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డితే స్పందించే వారే లేరు. అబ్దుల్ స‌లాం గారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు ఆపి కఠినంగా శిక్షించాలి’అని లోకేశ్ డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/