నా నెక్ట్స్ బర్త్ డే ముఖ్యమంత్రి కార్యాలయంలో .

కమల్ హాసన్ ట్వీట్

kamal haasan tweet
kamal haasan tweet

Chennai: నా నెక్ట్స్  బర్త్ డేని  తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందామని విశ్వ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేయడం విశేషం.

‘లోక‌నాయ‌కుడు’ క‌మ‌ల్ హాస‌న్ రీసెంట్‌గా త‌న 66వ బ‌ర్త్‌డే ని ఘ‌నంగా జ‌రుపున్నారు.

అయితే త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికి  పేరు..పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు క‌మ‌ల్ హాస‌న్.

ట్విట్ట‌ర్‌లో ‘నాకు విషెస్ అందించిన అభిమానుల‌కు, సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రికి ధ‌న్య‌వాదాలు’. మీ అంద‌రి దీవెన‌లు నా పుట్టిన రోజును చాలా ప్ర‌త్యేకంగా మార్చాయి.

నా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన మ‌క్క‌ల్ నీది మయ్యం కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్యావాదాలు.

మీ క‌ష్టానికి, ప్రేమ‌కు త‌గ్గ ఫ‌లితం ద‌క్కేలా నేను క‌ష్ట‌ప‌డ‌తా.

నా త‌ర్వాతి పుట్టిన రోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ (తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం)లో జరుపుకుందామని కమల్ ట్వీట్ చేయ‌డం ప్రాధాన్య‌త  సంత‌రించుకుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/