మధ్యాహ్నం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రెస్‌ మీట్‌

మధ్యాహ్నం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రెస్‌ మీట్‌
election commission

న్యూఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఈసీఐ) మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. డిప్యూటీ ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌లు సుదీప్ జైన్‌, చంద్ర‌భూష‌ణ్ కుమార్‌, అశీశ్ కుంద్ర ఈ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు, దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉపఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఈ స‌మావేశంలో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇటీవ‌ల బీహార్‌లోని 243 అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు మ‌రో 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జరిగాయి. బీహార్ అసెంబ్లీకి అక్టోబ‌ర్ 28, న‌వంబ‌ర్ 3, న‌వంబ‌ర్ 7 తేదీల్లో మూడు విడుత‌లుగా పోలింగ్ జ‌రుగ‌గా, ఇత‌ర రాష్ట్రాల్లోని ఖాళీ స్థానాల‌కు కొన్నిచోట్ల‌ న‌వంబ‌ర్ 3న‌, మ‌రికొన్నిచోట్ల న‌వంబ‌ర్ 7న పోలింగ్ జ‌రిగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/