పగటి కలలు కంటున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి

vijayasaireddy

అమరావతి: వైస్సార్పీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల, అయితే ఆ కలను రూపొందిచాలని పగటి కలలు కంటున్నాడని చెప్పారు. అక్షర దౌర్భాగ్యుడు చంద్రబాబు, ఏది నోటికొస్తే అది మాట్లాడడం,దానిని మీడియా వాళ్ళు బ్యానర్ గా వేస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు చంద్రబాబును చెత్తలో తొక్కినప్పటి నుండి పీడ కలలు వదలడం లేదు .శ్రీలంక మాదిరిగా ఏపీ రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారు. గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం రూ.1.50లక్షలు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ .2 .08లక్షలు. ఆ ముందు ఏడాది కంటే రూ. 31వేలు పెరిగినట్లు కనిపించట్లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిచారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/