నేడు దెందులూరులో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ

దెందులూరు సభకు హాజరుకానున్న 50 నియోజకవర్గాల క్యాడర్

cm-jagan-siddam-sabha-in-denduluru-today

అమరావతిః సిద్ధం సభల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి సభ భీమిలిలో జరగగా… ఈరోజు దెందులూరులో రెండో సభ జరగనుంది. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌సిపి క్యాడర్ హాజరుకాబోతున్నారు. మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి.

ఈనాటి సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 10 ప్రాంతాల్లోని 150 ఎకరాల స్థలంలో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. 3,298 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దెందులూరులోని హెలిప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 4.45 గంటల వరకు ఆయన సభలో ప్రసంగించనున్నారు.