బిజెపిలో చేరిన సాధినేని యామిని శర్మ
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న యామిని

కడప: గతేడాది నవంబర్ మాసంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామని శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. గజేంద్ర షెకావత్ ఆమెకు బిజెపి కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు టిడిపి నేతలు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరితో పాటు పలువురు బిజెపి నేతలు హాజరయ్యారు. కాగా నేడు కడపలో పౌరసత్వ సవరణ చట్టం అవగాహన కోసం బిజెపి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో గజేంద్ర సింగ్ షేకావత్ ప్రసంగించారు. కొన్ని రాజకీయ పార్టీలు సీఏఏ పై అవగాహన లేకపోవడంతోనే ప్రజలను రెచ్చగాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సీఏఏపై అవగాహన లేకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ చట్టం ఏ ఒక్క మతానికి, కులానికి, సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/