రోహిత్ శర్మ పేరుతో హైదరాబాద్‌లో క్రికెట్ స్టేడియం
శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో శంకుస్థాపన చేపిన రోహిత్ శర్మ దంపతులు

హైదరాబాద్: టీమిండియాకు పరుగుల వరద పారించే క్రికెటర్ రోహిత్ శర్మ. కోహ్లీతో పోటాపోటీగా రికార్డులను కొల్లగొడుతున్న ఈ ముంబయి ఆటగాడి పేరుమీద తెలంగాణలో ఓ క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నారు. అంతేకాకుండా అక్కడే ఓ అకాడమీని కూడా స్థాపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఈ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి రోహిత్‌శర్మ సతీసమేతంగా వచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. త్వరలో ఇక్కడికి ఇతర టీమిండియా క్రికెటర్లను కూడా తీసుకువస్తానని తెలిపాడు. కాగా ఇక్కడి కన్హ గ్రామ శివార్లలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియం నిర్మాణం జరుగుతుంది. దీనిపై రామచంద్ర మిషన్‌కు చెందిన కమలేష్ మాట్లాడుతూ, యువతకు స్పూర్తినిచ్చే వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకడని ఆయన అన్నాడు. అందుకే అతని పేరును క్రికెట్ స్టేడియంకు పెట్లామని వివరించారు. అనంతరం రోహిత్ శర్మ నిర్మాణ పనులను స్వయంగా తిలకించాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/