అనంతపురం టీడీపీలో ఆసక్తికర పరిణామం : కలిసిపోయిన బద్ధ శత్రువులు

అనంతపురం తెలుగుదేశం పార్టీ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిల్లాలో బద్ద శత్రువులు గా పేరు తెచ్చుకున్న జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం కలిసి కార్య కర్తల్లో ఉత్సహం నింపారు. జేసీ కుటుంబం గతంలో కాంగ్రెస్‌ లో ఉన్నప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య తగదాలు ఉండేవి. 2014 అనంతరం జేసీ కుటుంబం కూడా టీడీపీ లో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వచ్చింది కానీ నేరుగా మాత్రం ఎవ్వరు కలుసుకొని మాట్లాడుకున్న దాఖలాలు తక్కువ.

అయితే ఈరోజు జిల్లాలో నారా లోకేష్ పర్యటన సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇద్దరూ కలుసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం నవ్వుతూ పలకరించుకోవడం అక్కడ అందర్నీ ఆశ్చర్యానికి, ఒకింత సంతోషానికి గురి చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీరామ్ నవ్వుతూ పలకరించుకుంటున్న వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంచి మిత్రుల లాగా…. కలిసి మెలిసి మెలగడం తో వీరిద్దరూ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన తెలుగు దేశం తమ్ముళ్లు ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు.