ఢిల్లీలో వరల్డ్ బుక్‌ఫెయిరర్ ప్రారంభం

న్యూఢిలీ: ఢిల్లీలో తాజాగా వరల్డ్ బుక్‌ఫెయిరర్2020గ ప్రారంభమైంది. ప్రగతి మైదానంలో ప్రారంభమైన ఈ పుస్తకాల పండగకు పెద్దయెత్తున పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. ఈ బుక్‌ఫెయిర్‌లో దేశ విదేశాల నుంచి 600 మంది పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. జనవరి, 12 వరకూ జరిగే ఈ బుక్‌ఫెయిరర్‌లో దాదాపు 24 దేశాలు పాల్గొంటున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ప్రొక్రియాల్ నిశాంక్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలంటే ఆసక్తి ఉన్నవారికి ఈ బుక్‌ఫెయిర్ వారికి పండగ వంటిదేన ని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ సాహిత్యం అనేది అత్యంత గొప్ప హ్నేహితుడని ఆయన అన్నారు ఆసియాలోనే న్యూఢిల్లీలో ప్రారంభమైన బుక్‌ఫెయిర్ అతిపెద్దదని ఆయన అన్నారు. భారతదేశంలో సాహిత్యానికి కొదవలేదని, ఎంతో మంది కవులు, పండితులు, రచయితలు ఉన్నారని ఆయన అన్నారు. ఒక విధంగా భారత్ ప్రపంచానికే విశ్వగురువుగా ఆయన పేర్కొన్నారు. భారత దేశంలోని కవులు, రచయితలు రాసిన సాహిత్యానికి వివిధ దేశాల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు. ప్రపంచానికి గాంధీజీ బోధించిన సత్యాగ్రహం, అహింస మార్గాలు అందరికీ అనుసరణీయమని అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/