హోటల్లో భారీ పేలుడు.. 22 మంది మృతి

హవానా: క్యూబాలోని హవానాలో ఉన్న ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సరటో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో శక్తివంతమైన పేలుడు చోటుచేసుకున్నది. దీంతో 22 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి హోటల్‌లోని ఐదు అంతస్తులు ధ్వంసమయ్యాయి. హోటల్‌ బయట ఉన్న బస్సులు, కార్లు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గ్యాస్ లీకేజీగా కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.

గ్యాస్ లీకేజీగా కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తున్నదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌ కానెల్‌ చెప్పారు. గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని హోటల్ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. కాగా, ఈ హోటల్‌ను 1930లో నిర్మించారు. ఇందులో 96 గదులు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/