ప్రమాదంలో రహదారి భద్రత

నిర్లక్ష్యాన్ని వీడాలి

మానవుడు సుఖానికి, సంతోషానికి అభి వృద్ధిదోహదం కావాలి. సుఖం కోసం అభివృద్ధిమార్గాలను అన్వేషిస్తాం. రోడ్లు అభి వృద్ధికి సోపానాలు అనేది అందరికి తెలిసిందే. మరి ఆ సోపానాలు మృత్యువ్ఞకు మార్గాలైతే ఎవరికి చెప్పుకో వాలి? ఏమని చెప్పుకోవాలి? రోడ్డు ప్రమాదాల్లో మర ణించేవారు, క్షతగాత్రులయ్యేవారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది.ఇలాంటి సందర్భాల్లో మృతులకు సంబం ధించిన స్నేహితులు, బంధువ్ఞలు ఏడ్చేవారిని చూసి కన్నీరు సైతం ఘనీభవించే స్థితికి చేరుకున్నదేమోననిపి స్తున్నది. ఈ ప్రమాదాలకు తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు పాలకులు, అధికారులు, వాహనచోదకులు అందరూ భాగస్వాములే. ఏటా వేలాది మంది అమా యకులు ఇందుకు బలైపోతున్నారు. తాజాగా మొన్న కర్నూల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పధ్నాలుగు మంది మరణించారు. చిత్తూరుజిల్లా మదనపల్లికి చెందిన పదహారు మంది ఒక టెంపోలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు వెళ్లేందుకు శనివారం రాత్రి బయలుదేరారు. కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వస్తుండగా వెల్దూర్తి మదర్‌పురంవద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌కి దాదాపు నలభై అడుగుల దూరం పల్టీలు కొడుతూ అవతలవైపు రోడ్డువైపు దూసుకువెళ్లి ఎదురుగా ఇనుపఖనిజం లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టింది. టెంపో పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా పధ్నాలుగు మంది అక్కడికక్కడే మృతిచెందారు. శరీరభాగాలు ఛిద్రమై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

పధ్నాలుగు మంది మరణించినా, నలుగురు చిన్నారులు మాత్రం వాహనాలు పల్టీకొట్టినప్పుడు సీట్లో ఉన్నవారంత తలకిందులైన సమయంలో అందరి మధ్య చిక్కుకుపోవ డంతో నలుగురు పిల్లలు మృత్యుంజయులుగా బయట పడ్డారు. ఇక అంతకుముందు రోజు హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం అరకు ప్రాంతానికి బయల్దేరిన ఒక ప్రైవేట్‌ బస్సు అరకు ఘాట్‌రోడ్‌లో ప్రమాదానికి గురైన సంఘట నలో నలుగురు అక్కడికక్కడే మరణించగా గాయపడిన మరో పదహారు మందిని ప్రత్యేక వాహనంలో హైదరా బాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. డ్రైవర్‌కు అవగా హన లేకపోవడంవల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తును బట్టి చెప్తున్నారు.

ఇక ఆదివారం రాత్రి మహారాష్ట్రలో జలగాంవ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదహారు మంది మరణించారు. ఇరవై మందికిపైగా కూలీలతో ధూలే నుండి రేవర్‌కు వెళ్తున్న ఒక ట్రక్కు కింగ్వాన్‌ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడటంతో అక్కడికక్కడే పదహారు మంది మరణించగా మరో ఐదుగురు తీవ్రంగానే గాయపడ్డారు. ఇందు లో ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు మహిళలు, మరో ఇద్దరు చిన్నారు లున్నారు.వీరంతా రోజువారీ కూలీలే. ఇకపోతేఆదిలాబాద్‌ జిల్లాలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులను ఒక లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో జరిగిన ఒక రోడ్‌ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. జగిత్యాల జిల్లా పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో భార్యాభర్తలతోసహా వారి కుమార్తె మరణించారు. అదృష్ట వశాత్తు వారి కుమారుడు అతికష్టంగా బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గతనెల రోజులుగా ప్రమాదాలపరంపర కొనసాగుతూనే ఉంది.

కర్ణాటకలో బాల్యస్నేహితురాళ్లు అందరూ కలిసి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు. అది మరు వకముందే మూడు రోజులకే గుజరాత్‌లో రోడ్డుపక్కనే నిద్రిస్తున్న వలస కూలీలపై ఒక వాహనం దూసుకువెళ్లడంతో పధ్నాలుగు మందిప్రాణాలు పోయాయి. ఆ తర్వాతనే పశ్చిమబెంగాల్‌ జెల్సాయి గుడిలో పధ్నాలుగు మంది,అంతకుముందుతెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదం తొమ్మిది మందిని పొట్టనపెట్టుకున్నది. దేశవ్యాప్తంగా ఈప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగి పోవడం ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాదివరకు లెక్కలు చూస్తే సరాసరి రోజుకు నాలుగువందల మందికిపైగా మృత్యువాతపడుతుండగా మూడు లక్షల మందికిపైగా వికలాంగులు అవ్ఞతున్నారు. రహదారి భద్రతలో వేగం కన్నా ప్రాణం మిన్నా అనే ప్రధాన సూత్రాన్ని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి అటు కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు అనేక చర్యలు చేపడుతూనే ఉన్నాయి.

కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరిస్తూనే ఉన్నారు. నిబంధనల మీద నిబంధనలు పెడుతున్నారు. అయినా ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది. కొన్ని ప్రమాదాలు పోలీసు రికార్డులకు కూడా ఎక్కడం లేదు. ప్రమాదాలకు కారణాలు ఎన్నో ఉన్నా మద్యం కూడా కీలకపాత్ర పోషిస్తున్నది. ఇది నిపుణుల అధ్యయనంలో బయటపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమా దాలు ఏస్థాయికి చేరుకుంటాయో చెప్పలేని పరిస్థితి. భర్తలను కోల్పోయిన భార్యలు,తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఒక్క రేమిటి గత పదేళ్లల్లో తెలుగు రాష్ట్రాల్లో లక్షకుపైగా కుటుంబాలు పడుతున్న మానసిక వేదన వర్ణనాతీతం. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ అభ్యాగులకు ఏమి ఇచ్చినా, మాటలతో ఎంత ఊరట కల్పించినా వారి బాధను తీర్చలేం. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర పాలకులు మనసుపెట్టి ఆలోచించాలి. ఇంకా నిర్లక్ష్యం చేస్తే వాహనాలు మృత్యుదేవతల్లా రోడ్లపై వీరవిహారం చేయకమానవు.. వేలాది ప్రాణాలు అర్థాంతరంగా ముగియక తప్పవు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/