దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ‘ఆప్‌’

Delhi CM Kejriwal

కేంద్రప్రభుత్వం సహాయసహకారాలు లేనిదే ఏదీ ముందుకు సాగదు. అందువలన ఆమ్‌ ఆద్మీ పార్టీ అసెంబ్లీలో ఘనవిజయం సాధించినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భవిష్యత్తులో అన్ని పరీక్షలు ఎదుర్కోవలసినదే. రాజకీయ విజ్ఞత, మూర్తీభవించిన లౌకిక పారదర్శకత, నీతి నిజాయితీలతో సామాన్యజనజీవన సంక్షేమానికి కట్టుబడిన ఆమ్‌ ఆద్మీపార్టీ జాతీయస్థాయి రాజకీయ విజయాల మాట అటుంచి ఢిల్లీ అసెంబ్లీలో నిలద్రొక్కుకొనే పరిస్థితుల అనుకూలతను ఆశ్రయించకతప్పదు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాధికారం చేపట్టిన రాష్ట్రాల పట్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ కేంద్రాధిపత్యం వ్యవహరిస్తున్న తీరుతెన్నులు పరిశీలిస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ భవిష్యదర్శనం ఎన్నో సవాళ్లు ఎదుర్కోకతప్పదు.

పంచవేద ధార్మిక ప్రతిష్ట కలిగిన మహాభారత కథనంలోని పాండవ్ఞల రాజధాని, యమునా నదీ తీరంలోని ‘ఇంద్ర ప్రస్థం ప్రస్తుతం అధునాతన ఇండియన్‌ యూనియన్‌ భారతదేశ రాజధాని ఢిల్లీ మహానగరంగా,విలసిల్లుతోంది. సుల్తాన్‌లు, బాదు షాలు, మహారాజులు, బ్రిటిష్‌ ప్రభువ్ఞల చారిత్రక వైభవం పుణి కి పుచ్చుకొన్న దేశ రాజధాని, స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య మహోదయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి రాజకీయ పార్టీల పాలనాధికారానికి కేంద్రమైంది.

ఒకప్పుడు భారత జాతీయ కాంగ్రెస్‌ ఏలికలోని, ఢిల్లీ అసెంబ్లీపై రాజ్యాధికార ఆధిపత్యాన్ని ప్రస్తావిస్తూ బిజెపి మహానేత వాజ్‌పేయీ, 1996 సార్వత్రిక ఎన్నికలకు ముందు 11 అశ్వమేథ యాగాశ్వాన్ని వదిలాం. అది ఢిల్లీ దిశగా దూసుకుపోతోంది అన్నారు విజయోత్సాహంతో. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీలో పాగావేసిన కమలనాథులు, ఎన్‌డిఎ కూటమికి తొలి సారధ్యం అనుకూలించినా, 1998 నుంచి మళ్లీ కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకొంది.

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీకి మొత్తం ఏడు లోక్‌సభస్థానాలు, ఢిల్లీ పరిధిలోని మూడు మహానగర పాలికలు కైవసం అయినా తాజా 2020 ఎన్నికలరంగంలో కూడా ఢిల్లీ అసెంబ్లీ కొరకరాని కొయ్యఅయింది. పౌరసత్వచట్టం, హిందుత్వం, పాక్‌ ఉగ్రవాదం,జాతీయతా దేశభక్తి మేళవించుకొని రెండొందల మందికిపైగా ఎంపిలు,యాభై మంది కేంద్రమంత్రు లు, ర్యాలీలు, రోడ్‌షోలు ప్రచార సంరంభం మిన్నుముట్టినా, ఢిల్లీ ఓటర్లు చీపురు చేపట్టి సింహాసనంపై కూర్చోప్టెటడం కమలనాథులకు మింగుడుపడటం లేదు.

నరేంద్ర- అమిత్‌షాల చాణక్య నీతిని నిర్ద్వంద్వంగా తిప్పికొట్టి ఇంద్రప్రస్థాన్ని ఢిల్లీ పౌరులు, అతిసామాన్య పౌర రాజకీయ పార్టీకి పగ్గాలు అందిం చారు.ముచ్చటగా మూడవసారి, ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌, అవినీతి వ్యతిరేక గాంధేయ సిద్ధాం త ఉద్యమనేత అన్నాహజారెతో, జనలోక్‌పాల్‌ బిల్లు చట్టంగా రూపొందించడానికి 17 నెలలు శాంతియుత సమరం పునాదిగా, ఢిల్లీ రాజకీయ రంగంలో అడుగుపెట్టారు.

పూర్తిస్థాయి అసెంబ్లీ అధికార హోదాలేని ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 2013 నుంచి ఎన్నో ఒడిదుడుకులతో నెగ్గుకొచ్చారు. 2013లో 28, 2015లో 67, 2020లో 62 సీట్లు గెలిచి జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలతో ఎన్నికల సమరంలో ఎఎపి విజయానికి సారధ్యం వహించారు.తొలి ముఖ్యమంత్రిగా 49 రోజుల తర్వా త లోక్‌పాల్‌బిల్లు సాధించలేని నిస్సహాయత కారణంగా ముఖ్య మంత్రి రాజీనామాచేసి చరిత్ర సృష్టించారు.

తర్వాతి అయిదేళ్ల పాలనలో సామాన్య జనమౌలిక సంక్షేమం, ప్రతి కంటి కన్నీరు తుడిచే స్వచ్ఛమైన, నీతి నిజాయితీల పాలనతో సామాన్య జనావళి మళ్లీ ఆప్‌పార్టీని గద్దెఎక్కించారు. కేవలం 70 సీట్లు వ్ఞన్న ఢిల్లీ అసెంబ్లీలో 8 సీట్లు మాత్రమే గెలుచుకొన్న రాజ కీయం, కేంద్రాధికారంతో తలమునకలవ్ఞతున్న బిజెపి సారధ్యంలోని ఎన్డీయే కూట మికి ఊపిరిసలపనివ్వటం లేదు.ఓట్ల కొనుగోలు,మద్యంపంపిణీ, శుష్కవాగ్దానాలు, కులమత ప్రాంతీయ సంకుచితతత్వాలు విజ యం సాధించడానికి రాజమార్గంగా రాజకీయ పార్టీలు వ్యవహరి స్తున్న ప్రస్తుత దశకాలలో మిగిలిన అసెంబ్లీల ప్రాంతీయ పార్టీల విజయం మాట అటుంచి ఆప్‌ చీపురుకట్ట గుణపాఠమైంది.

తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న రాజకీయపార్టీలకు విభిన్నంగా లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు, ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎఫ్‌డిఆర్‌) అధ్యక్షుడు డాII జయప్రకాశ్‌ నారాయణ్‌ ‘సామాన్య జనావళి మౌలిక సంక్షేమం లక్ష్యంగా ఆరోగ్యం, విద్య అంశాలలో చిత్తశుద్ధితో సేవలందించి విజయం సాధించిన ఆప్‌ ప్రప్రథమంగా భారతీయ ప్రజాస్వామ్యాన్ని ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాలను ప్రభావితం చేయగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

2013లో తొలి స్వల్ప అధికారంలోనే సర్కారీ కార్యాలయాలలో అవినీతిని ఊడ్చేసే చీపురు ఎన్నికల గుర్తుతో కాంగ్రెస్‌,బిజెపిల మధ్యకు దూసుకువచ్చిన ఆప్‌పార్టీ ఉచితవిద్యు త్‌, తాగునీరు, వంటి నిత్యావసరాలపై దృష్టి సారించి క్రమేపీ మొహల్లా క్లినిక్‌ల ద్వారా ప్రజారోగ్యం, పాఠశాలలో విద్యాప్రమా ణాలు,బాలికలను మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, భద్ర త, అధికార వికేంద్రీకరణ ఎన్నో సేవలతో సుమారు 2కోట్ల ఢిల్లీ జనసామాన్య జనావళి మన్నన పొందింది. అయిదేళ్లుగా తాము చేసిన పనిఆధారంగా అనవసర రాజకీయ సిద్ధాంతాలకుయుక్తుల జోలికి పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

సామాన్య ప్రజల సంక్షేమం, జీవన మౌలిక అవసరాలపట్ల అంకిత భావం దారితప్పకుండా ఎన్నిఒడిదుడుకులు ఎదురైనా కేంద్ర,రాష్ట్ర సం బంధాలు బెడిసికొట్టకుండా కేజ్రీవాల్‌ అద్భుతరాజనీతి ప్రదర్శించి అన్నిపార్టీల, అన్నివర్గాల ప్రజలను ఆకట్టు కొన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఓటర్లు,యావద్భారత దేశంలో ప్రాంతీయ రాజకీయ శక్తి ఏవిధం గా పటిష్టమైన అధికార ప్రాబల్యం సాధించగలదో,కేవలం కేంద్రా ధిపత్యంపై ఆధారపడకుండా తమ రాష్ట్రప్రజల జనజీవన సంక్షే మానికి కట్టుబడివ్ఞండే పాలన నైతికవిలువల జనశ్రేయస్సు, సం క్షేమ పాలనకు బాసటగా నిలిచారు. కేంద్రం సహకారం లేనిదే రేప్‌ కేపిటల్‌గా,వాయుకాలుష్య రాజధాని నగరంగా ప్రపంచానికి సుపరిచితమైన ఢిల్లీ మహానగరానికి సంబంధించి అసెంబ్లీ, పార్ల మెంటు,ప్రభుత్వాలు ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

మహా నగరంలో కొన్నిప్రాంతాలలోని తీవ్రవాయుకాలుష్యానికి హరియా నా,ఉత్తరప్రదేశ్‌ వంటిపొరుగు రాష్ట్రప్రభుత్వాలు కారణమవ్ఞతుం డటం,నగరంలోని వాహనకాలుష్యం వలన కూడా శృతిమించే విపత్కర పర్యావరణం తలెత్తుతోంది.

గ్రేడెడ్‌ రెస్పాన్స్‌యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టిఅర్బన్‌ మొబిలిటీపై ఎపిపిదృష్టి సారించింది. ప్రజా రవాణా పెరగడానికిఇంకా అత్యధిక సంఖ్యలో 11వేల బస్సులు, 500కి.మీలఢిల్లీమెట్రో నెట్‌వర్క్‌కు ప్రయత్నాలుచురుకుగా సాగు తున్నాయి. కేజ్రీవాల్‌ గ్యారంటీ కార్డ్‌ పది అంశాల ప్రణాళికలో 20వేలలీటర్ల ఉచితతాగునీటి సరఫరారోజంతా ఇవ్వవలసిఉంది. గృహనిర్మాణాలకు సంబంధించి భూసేకరణ చేపట్టే ప్రతిపాదన లున్నాయి.యమునానది జలకాలుష్యం నివారించవలసిఉంది.

  • జయసూర్య

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/