జీఎస్టీ ఫ్రీ కరోనా కు మద్దతు తెలిపిన రేవంత్‌రెడ్డి

కరోనా వైద్యపరికరాలను జీఎస్టీ నుండి మినహయించాలని డిమాండ్‌

reventh reddy
reventh reddy

హైదరాబాద్‌: దేశంలో కరోనా చికిత్సలో ఉపయోగించే వైద్య పరికరాలను వస్తు సేవల పన్ను (జిఎస్టి) నుంచి మినహయించాలని మల్కాజ్‌గిరి ఎంపి, తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. దేశంలో ఇప్పటికి కరోనా పరికరాలపై 12 నుండి 18 శాతం వరకు జిఎస్టి విధిస్తుండడం షాకింగ్‌గా ఉందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ చేపట్టిన జిఎస్టి ఫ్రీ కరోనా ప్రచారానికి మద్దతు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/