ఈ విషయం పార్టీనే నిర్ణయిస్తుంది : విజయశాంతి

కామారెడ్డిలో కెసిఆర్​పై పోటీ వార్తలపై స్పందించిన విజయశాంతి..

Vijayashanthi reacted to the news of contest against KCR in Kamareddy..

హైదరాబాద్‌ః సినీ నటి, బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ గజ్వెల్, కామారెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో కెసిఆర్ పై విజయశాంతిని బరిలోకి దింపాలని బిజెపి నాయకత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా విజయశాంతి స్పందించారు.
‘కామారెడ్డి అసెంబ్లీ లో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బిజెపి కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బిజెపి గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.