దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు

ఇప్పటి వరకు భారత్‌లో 543 కరోనా మృతులు

Coronavirus India
Coronavirus India

న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ తన పంజా విసురుతుంది. కరోనా కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి.గత 24 గంటల్లో ఏకంగా 1,533 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 17,265కు పెరిగింది. నిన్న కొత్తగా మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 543కు చేరింది. అలాగే, ఇప్పటి వరకు 2,546 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకు 4,203 కేసులు నమోదు కాగా, 223 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 507 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 2,003 మంది కరోనాతో బాధపడుతుండగా 45 మంది మృతి చెందారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/