అనుమతుల వాహనాలపై పునఃపరీశీలన

లాక్‌డౌన్‌ పొడిగింపుతో తాజా నిర్ణయం.. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

vehicle checks hyderabad
vehicle checks hyderabad

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ లాక్‌డౌన్‌ కాలాన్ని వచ్చేనెల ఏడో తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ గడువు పొడిగించడమే కాకుండా మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అత్యవసర, తప్పనిసరి కారణాలతో రోడ్లపై తిరిగేందుకు కొన్ని వాహనాలకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా సీపీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమతి ఉన్న వాహన చోదకులు కూడా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ కట్టడికి పోలీసుల పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/