రైతుకు రక్షణ.. సాగుకు శిక్షణ

రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు

Farmers
Farmers

రైతుభరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చడమేగాక త్వరలో శాశ్వత భవనాలను సైతం నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, ట్రాక్టర్లను కూడా తక్కువ అద్దెకు రైతులకు లభించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

విత్తనాలు, ఎరువ్ఞలు, పురుగు మందులనో రైతుభరోసా కేంద్రాల్లో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. సమగ్రవ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించి అన్నదాతల సేవలో పునీతం కావాలని ఎపి ప్రభుత్వం కంకణం కట్టుకోవడం హర్షణీయమే. చేనుకు చేవ-రైతుకు రొక్కం అనే నానుడిని నిజం చేయాలని సంకల్పించడం ముదావహం. రైతు మోహనదరహాసం రంజింపచేయాలని సకల జివోల కోరిక!

కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాలు, అందులో రైతు భరోసాకేంద్రాల ద్వారా సేద్య సంబంధిత కార్యకలాపాలు, సల హాలు, సూచనలు ఇచ్చేలా వ్యవ సాయ ప్రణాళికల కూపకల్పన హర్షణీయం.

రైతుకు వెన్నెముకగా వ్యవహరించే వ్యవసాయశాఖ బాధ్యత మరింత ద్విగుణీకృత మైంది. కరోనా బాధల్లో ఉక్కిరిబిక్కిరైన రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవడానికి సకలచర్యలు చేపట్టాల్సి వ్ఞంది. సేద్య సన్నద్ధతను మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా సందోర్భచితం. రైతు సంక్షేమం లేని రాజ్యం పూజ్యం..

నడుస్తున్న చరిత్రలో సరికొత్త అధ్యాయ మిది. విశాలభారతంలో, గ్రామీణ వ్యవస్థలో జనాభాపరంగా ఏవిధంగా విశ్లేషించినా రైతే అగ్రభాగాన నిలుస్తాడు. ఆ రైతు బాగోగులపైన సమకాలీన చర్చ సాగుతోంది. ఆరుగాలం శ్రమించి అన్నదాతలు అందించే ఆహారం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇటీవల ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో రైతులపైనే దృష్టి కేంద్రీకృతమవటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఇతర అంశాలతోపాటు వ్యవసాయ రంగాన్ని గుర్తించి అన్నదాతలకు చేదోడువాదోడుగా నిలవాలని అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త వ్యవసాయ విధానాన్ని ప్రకటించి నూతన ఆరంభానికి నాంది పలికారు.

ఎపిలో రైతుభరోసా కేంద్రాలకు రూపకల్పన చేసి మేనెల 30వ తేదీన అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదొక నూతన శకమని రైతులే లక్ష్యమని, సంక్షేమబాటకు తెరదీస్తోంది. తెలుగునేలపై ఇప్పుడు వ్యవసాయ స్ఫూరణలే కనిపిస్తున్నాయి. రైతుల బాగు-సాగుపైనే కీలక చర్చలు, విశ్లేషణలు సాగుతున్నాయి.

వ్యవసాయరంగ అభివృద్ధితోనే భారతదేశం పురోగమిస్తుందని కేంద్రప్రభుత్వమూ గుర్తించింది. రైతులను రారాజలుగా తీర్చిదిద్దితేనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కరోనా పరిణామాల నేపథ్యంలో 20లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీలో వ్యవసాయానికి, అనుబంధ రంగాలకు భరోసా కల్పిస్తూ ముందుకొచ్చింది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంతోపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు.

ప్రాజెక్టుల ద్వారా నీళ్లని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. భగీరథయత్నమే రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడితో నియంత్రత సాగుకోసం రైతులను చైతన్యపరుస్తూ దానికనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చింది.

వ్యవసాయాధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశనం చేయనుంది. గతానికి భిన్నంగా 90లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి అమ్మడం ద్వారా నూతన అధ్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టిం చింది. మూసపద్ధతి వ్యవసాయాన్నుంచి బయటపడాలని రైతులను కోరుతోంది.

రైతుల్ని ఒప్పించి, మెప్పించి నియంత్రణ వ్యవసాయాన్ని అమల్లోకి తేవాలని సర్కారు తలపోస్తోంది. వరిసాగులో నాటు మొదలు పంట కోయడం, నూర్పిళ్లు చేయడం వగైరా పనుల్లో ఈ పోటికే యాంత్రీకరణ చోటు చేసుకుంది.

అయితే కొన్ని పంటల విషయంలో, ఉదాహరణకు పత్తిసేద్యంలో యంత్రాల వాడకం ఇంకా మార్పుచెందాల్సిఉంది. ఇలా రకరకాల పంటలకు సంబంధించి అవసరాలను గుర్తించి తదనుగుణంగా మార్పులు తీసుకొస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ పాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడం గమనార్హం. రైతుసంక్షేమమే ధ్యేయంగా రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణకు పూనుకున్నది.

ఈ కేంద్రాల ద్వారా రైతులకు భరోసానిచ్చి ఆదుకోవాలనుకొంటుంది. ఈ పోటీకి చాలాగ్రామాల్లో ప్రారంభపనులు కొలిక్కివచ్చాయి. కేంద్రాలు నెలకొల్పేందుకు అవసరమైన మౌలికసదుపాయాలు, ఫర్నీచర్‌, కంప్యూటర్ల చేరవేత శరవేగంగా జరుగుతోంది.

గ్రామసచివాలయాల్లో అక్కడక్కడా సర్దుబాటు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల అద్దె భవనాల్లో భరోసా కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేవాలన్నది ఆలోచనగా ఉంది. గతంలోనూ ఈ తరహా వ్యవ సాయ విభాగాలు, మండల, గ్రామస్థాయిలో ఉన్నా పెద్దగా రైతు లకు ఉపకరించలేదనే వాదనే ఎక్కువ ఉండేది. నామ్‌కేవాస్తే విభాగాలుగా పిలువబడేవి. ఉదాహరణకు డిమాన్‌స్ట్రేటర్లు ఉండేవారు.

వారి విధుల నిర్వహణపై స్పష్టత ఉన్నా పలు సాంకేతిక కారణాలతో పరిమితంగాను రైతుల అవసరాలు తీర్చడంలో నిమగ్నమయ్యేవారు. పంటల సాగుతీరుపై విస్తృత అధ్యయనాలలేమి, నిధులకొరత,

రైతుల సహకారం లేకపో వడం, పరిశోధనల్లో వెనుకబాటు, మార్కెటింగ్‌లో దోపిడీ విధానాలు ఇలా పలు అంశాలు రైతులకు అవగాహన కల్పించడంలో, మార్పు తీసుకురావడంతో తీవ్రప్రభావాన్ని చూపేవి. సమయానికి విత్తనాలు అందుబాటులోకి రాకపోవడం, చీడపీడల నియంత్రణ ఇవన్నీ రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని మనందరికీ అవగతమే.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏర్పాడ్డాక వ్యవసాయరంగంలో విప్లవాత్మకమార్పులు ఆవిష్కృత మయ్యాయి. అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం కింద నగదును రైతుల ఖాతాల్లోకి చేర్చి భరోసాను కల్పిస్తూనే ఉంది. దరిమిలా రైతు భరోసా కేంద్రాలను తెరపైకి తీసుకొ చ్చారు. గ్రామస్థాయిలోనే అన్నదాతలకు కావాల్సిన అన్నిరకాల సేవలు అందించేందుకు ఒక వేదికను రూపకల్పన చేశారు.

దాదాపు 10,641 రైతు భరోసాకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయవిధానాలపై అవగాహన కల్పించడం, ఖర్చులు తగ్గించడం, దిగుబడి పెంచడం, పెట్టుబడులు తగ్గిం చడం, ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరచడం లాంటి చర్యలను ఈ కేంద్రాలద్వారా చేపడతారు. ఈ కేంద్రాల్లో గ్రామవ్యవసాయ సహాయకులు, హార్టికల్చర్‌, ఫిషరీస్‌ సహాయకులు, పశుసంవర్థక నిపుణులు రైతులకు అన్నివిధాలా సహకరిస్తారు.

ఏ తెగులుకు ఏమందు వాడాలో కూడా విశదీకరిస్తారు. రైతుభరోసా కేంద్రా లను కొనుగోలు కేంద్రాలుగా మార్చడమేగాక త్వరలో శాశ్వత భవనాలను సైతం నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, ట్రాక్టర్లను కూడా తక్కువ అద్దెకు రైతులకు లభించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

విత్తనాలు, ఎరువ్ఞలు, పురుగు మందులనో రైతుభరోసా కేంద్రాల్లో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. సమగ్రవ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించి అన్నదాతల సేవలో పునీతం కావాలని ఎపి ప్రభుత్వం కంకణం కట్టుకోవడం హర్షణీయమే.

చేనుకు చేవ-రైతుకు రొక్కం అనే నానుడిని నిజం చేయాలని సంకల్పించడం ముదావహం. రైతు మోహనదరహాసం రంజింపచేయాలని సకల జివోల కోరిక!

  • చెన్నుపాటి రామారావు

తాజా జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/