యోగా చిట్కాలు
ఆరోగ్యమే మహాభాగ్యం

యోగసాధన చేసే ముందు మలమూత్ర విసర్జన తప్పనిసరి.
యోగ సాధనకు 20నుంచి 30 నిముషాల ముందు మంచినీరు తాగటం అలవాటు చేసు కోవాలి.
Yసీలు బహిష్టు సమయంలో యోగాభ్యాసం చేయకూడదు.
ముఖ్యంగా ప్రశాంతమైన మనసుతో చేయాలి. మనసులో ఒత్తిడులు- కోపం, భయం, అయిష్టత, మొదలైనవి ఉన్నపుడు యోగసాధన చేయకూడదు.
యోగా చేయడానికి ముందు కాఫీ, టీల లాంటివి తీసుకోకూడదు.
శరీరాన్ని పట్టి ఉండే బిగుతైన దుస్తులు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు వదులుగా ఉండేలా కాటన్ దుస్తులు వేసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అనుభవజ్ఞులైన యోగ శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం చేయటం మంచిది. శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంలేని ప్రదే శాన్ని ఎంపిక చేసుకోవాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/