తీపి ఎక్కువగా తింటే..!

ఆహారం-ఆరోగ్యం

తీపి పదార్ధాలు తినటం వలన బరువు పెరగటం ఒక్కటే కాదు… మరికొన్ని ఉన్నాయి. మొటిమలు, యాక్నే పెరగటానికి కారణం తీపి ఎక్కువగా తినటమే.. అని అంటున్నాయి అధ్యయనాలు. ఇందుకోసం సంప్రదాయ వంటకాలు ఎక్కువగా తినే గ్రామీణుల పైనా , శుద్ధి చేసిన తీపి వస్తువులు తినే పట్టణ యువత పైనా అధ్యయనం చేసినపుడు .. యాక్నే సమస్య పట్టణ ప్రాంత టీనేజర్ల లోనే ఎక్కువగా కన్పించింది..

మనసు బాగోలేనపుడు తీయగా వుండే కేకులు , పేస్ట్రీలు, చాకొలేట్ తింటాం కదా. కానీ అవి దీర్ఘకాలంలో డిప్రెషన్ లోకి నెట్టేస్తాయట.

ముఖంలో వయసు ఛాయలు కన్పిస్తున్న చర్మం సాగిపోయి ముడతలు పడటానికి ప్రధాన కారణం తీపి పదార్ధాలే .. ఇవి చర్మం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి.

వాపులు తలెత్తటానికీ, దంతాల ఆరోగ్యం పాడవటానికీ, అజీర్ణ సమస్యలకు కూడా ఎక్కువుగా తీపి తినటమే కారణం.. అందుకే శుద్ధి చేసిన చక్కెరలు.. అంటే ..పంచదార ఉండే స్వీట్స్ కు కొంచెం దూరంగా ఉండటం మంచిది ..

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలకు ‘స్వస్థ’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health/