ఇంట్లో డ్రీమ్‌ క్యాచర్స్‌

ఇంటి అలంకరణ

Dream catchers at home
Dream catchers at home

ఇంటికి అలకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌ ఇలా అన్నింటిని కళాత్మకంగా సర్దితే ఇల్లు అందంగా కనిపిస్తుంది.

ఇంట్లో ప్రతి వస్తువు కలర్‌ఫుల్‌గా ఉండాలి. హోం డెకరేషన్‌ ప్రతి ఇంటికి కీ రోల్‌ వంటిది.

గది అలంకరణ హాయిగా, పరిశీలనాత్మకంగా, రంగులు, అల్లికలను కలపడం ఇంటి అలంకరణని మరింత అందంగా మారుస్తుంది. పెయింటింగ్స్‌ ఇంటికి కొత్త అందాన్నిస్తాయి.

పెయింటింగ్స్‌ కేవలం కంటికి ఇంపు మాత్రమే కాదు.

వినసొంపైన ఎన్నో విషయాలు మాట్లాడతాయి. అంతేకాదు మన భావోద్వేగాలపైన ప్రభావం చూపుతాయి. ఆహ్లాదరకమైన పెయింటింగ్స్‌ ఉన్న గదిలోకి వెళితే మనసు తేలికపడుతుంది

. గదిని ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయి. ఇంటికి మొక్కలు ప్రత్యేక అందాన్నిస్తాయని చెప్పనక్కరలేదు.

గది డిజైన్‌ని, వేసిన రంగులను దృష్టిలో ఉంచుకుని మొక్కలను ఎంచుకోవాలి. సోఫాకవర్లు, దిండు కవర్లు వంటివి తరచూ మారుస్తుంటే కొత్త లుక్‌ను ఇస్తాయి.

పక్షి బోనులను తీసుకుని వాటిలో చిన్న చిన్న మిక్కలను పెట్టవచ్చు. డ్రీమ్‌ క్యాచర్లు ఈ రోజుల్లో ఇంటికి అలంకరణకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

రంగురంతుల ఈకలతో అలంకరించిన వృత్తాకార డ్రీమ్‌ క్యాచర్‌ అలంకరణలో న్యూట్రెండ్‌.

వీటిని గోడకు, రూఫ్‌కి వేలాడదీయవచ్చు. వీటి ప్రదేశం గుమ్మం ద్గగరయితే అట్రాక్టివ్‌గా ఉంటుంది. వీటిలో కూడా గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన ముదురు రంగులే ఎంచుకోవాలి.

అయితే ఇల్లంతా ఎన్ని డ్రీమ్‌ క్యాచర్‌లు అలంకరించుకున్నా పర్వాలేదు కానీ ఒకే ప్రదేశంలో ఎక్కువ వేలాడదీయకూడదు.

డ్రీమ్‌ క్యాచర్‌లు పెట్టిన ప్రదేశంలో ఎల్‌ఈడి లైట్లను పెడితే అది మరింత అందాన్ని ఇస్తుంది. ఈ వెలుగులో అవి మరింత చూడముచ్చటగా కనిపిస్తాయి.

వీటికి మరింత అందాన్ని జోడించడానికి పూసతీగలను తలిగిస్తే ఇంటికి మరింత కళ వస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/