ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌

అందమే ఆనందం

ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌
Facepack

కరోనా వైరస్‌ వల్ల బయటికి వచ్చే పరిస్థితులు ఇప్పట్లో కనిపించకుండాపోయాయి. సాధారణంగా బయటికి వెళ్లే మహిళలు అందం కాపాడుకునేందుకు పార్లర్‌లకు వెళుతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం పార్లర్‌లు కూడా మూతపడ్డాయి. ఇంట్లోనే అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ఓట్స్‌, తేనె, యోగర్ల్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద స్క్రబ్బర్‌లా రాయాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ఫేస్‌మాస్క్‌లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది.

బ్లాక్‌ టీని కురులకు పట్టిస్తే, జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత

తరువాత ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. గోళ్లు అందంగా మెరవాలంటే గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో పాలిస్‌ చేయాలి.

దాంతో గోళ్ల దగ్గరి చర్మానికి పోషణ లభిస్తుంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/