గుడ్ మార్నింగ్ చెపుతూ సీఎం జగన్ ఫై నారా లోకేష్ సెటైర్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…సీఎం జగన్ ఫై సెటైర్ వేశారు. ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే ? అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం తారాస్థాయికి చేరింది. మూడు రాజధానులు వద్దంటూ అమరావతి రైతులు పాదయాత్ర చేయడం…టీడీపీ నేతలు వారికీ సపోర్ట్ గా నిలుస్తుంటే, మూడు రాజధానులే కావాలంటూ వైస్సార్సీపీ శ్రేణులు అంటున్నారు. పోటాపోటీగా ఇరువురు ర్యాలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ తన ట్విట్టర్ లో ముఖ్యమంత్రి జగన్ ఫై సెటైర్ వేశారు.

గుడ్ మార్నింగ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి… ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే ? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అని అమండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీని డెవలప్ చేయండని కోరారు. ఇక మరో ట్వీట్ లో జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ? పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల తన కొడుకు బసవయ్య మృతదేహాన్ని ఆ తండ్రి బండిపై తీసుకెళ్లిన హృదయవిదారక దృశ్యం మీ అమానవీయ పాలనకి నిదర్శనం‌. సర్కారు అంబులెన్సులు రావు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.