మార్చి 4న తెలంగాణ కు ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి తెలంగాణ లో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి..ఈ మేరకు ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటీకే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న బిజెపి..ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ సహా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి సభలు నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను ప్రధాని మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మర్చి 04 న హైదరాబాద్ లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే.. అదే రోజు అమిత్ షాకు బదులు మోడీ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియంలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.