బిఆర్ఎస్ కు ఎంపీ రాములు రాజీనామా

తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుండి కీలక నేతలు బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా కీలక నేతలంతా రాజీనామా చేసి వెళ్లగా..తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ రాములు BRSకు షాక్ ఇచ్చారు.

రేపు బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రాములు ఢిల్లీకి వెళ్లారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు BRSను విడినట్లు తెలుస్తుంది.