టీడీపీ కే ఓటు వేస్తామని చెప్పి వైస్సార్సీపీ ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చిన హోటల్ యజమాని

పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కు సొంత నియోజకవర్గం లో షాక్ షాక్ తగిలింది. వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేయాలని కోరగా..ఆ ఒక్కటి అడగొద్దు..మా ఓటు టీడీపీ పార్టీకే అని తేల్చి చెప్పి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని , ఆ ఇంటికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇంటి ముందు కు వచ్చిన చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం చేస్తున్నారు.

తాజాగా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు తన నియోజకవర్గంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని హోటల్ నిర్వాహకుడు పాపారావును ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు పాపారావు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ఇవ్వొద్దని, పింఛన్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనికి సరేనన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. వైస్సార్సీపీ పార్టీకే ఓటేయాలని పాపారావును కోరారు. అయితే, చేపల కూర పంపిస్తున్నాం తినండి కానీ, మా ఓటు మాత్రం టీడీపీకే వేస్తామని సదరు హోటల్ నిర్వాహకుడు తేల్చిచెప్పాడు. ‘మీరు జై జగన్ అన్నా.. మేం టీడీపీకే ఓటు వేస్తాం’ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే మరోమాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు.