ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

Prime Minister Modi exercised his right to vote

అహ్మదాబాద్‌: లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ సందర్భంగా గాంధీనగర్‌ లోక్‌సభ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోడీ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కవ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. సమయంతో పోటీపడుతూ మీడియా మిత్రులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని వెల్లడించారు.

గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిషా కూడా ప్రధాని మోడీతోపాటు పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చారు. పోలింగ్‌ కేంద్రం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ప్రధాని పలుకరించారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దుచేశారు.