గుండెపోటుతో పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ మృతి

మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిహార్లోని సుపాల్ పోలింగ్లో బూత్లో ప్రిసైడింగ్ అధికారు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. సదరు అధికారిని శైలేంద్ర కుమార్గా గుర్తించారు.

‘శైలేంద్ర కుమార్ ఈరోజు ఉదయం చనిపోయారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయణ్ను సిబ్బంది వెంటనే హీహెచ్సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి వచ్చారు. పోస్టుమార్టంలో ఆయనకు షుగర్ ఉన్నట్లు తేలింది’ అని ఓ అధికారి తెలిపారు.