హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయినా సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం సోనియా కరోనా బారినపడడంతో ఢిల్లీలోని స‌ర్ గంగారాం ఆసుప‌త్రిలో చేరారు. వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న సోనియా గాంధీ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోవడం తో ఆమెను ఆసుప‌త్రి వైద్యులు సోమ‌వారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియారు కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు.

నెషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్​కు ఈడీ కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల సోనియా ఈ విచారణకు హాజరుకాలేనని తెలిపారు. దీంతో జూన్​ 23న విచారణకు హాజరయ్యేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం సోమవారంతో కలిపి మొత్తం నాలుగు రోజులు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం రాహుల్ ఈడీ విచారణ ముగిసింది. రేపు కూడా ఈడీ ఆఫీస్ కు రావాలని తెలిపారు. మరోపక్క ఈడీ సమన్ల ఫై గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ వస్తుంది.