దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మోడీకి మాత్రమే ఉందిః లక్షణ్‌

Only Modi has the ability to lead the country forward: Lakhaman

హైదరాబాద్‌ః పంద్రాగస్ట్ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనీ, అది అమలు కాకుంటే ఆగస్ట్ సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో సానుకూలత ఉందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే సత్తా మోదీకి మాత్రమే ఉందని ప్రజలు పూర్తిగా విశ్వసించారన్నారు.

ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటు వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలను చాలామంది బెదిరించారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఏమాత్రం తగ్గలేదన్నారు.