హైదరాబాద్ కు చేరుకున్న ‘మహానటి’

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సింపుల్ లుక్ లో కీర్తి సురేష్

Keerthy suresh
Keerthy suresh

టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమాలకు మార్చి నుండి బ్రేక్ పడ్డ విషయం తెల్సిందే.

లాక్ డౌన్ సఢలించి జూన్ నుండి షూటింగ్స్ అంటూ ప్రకటించినా కూడా స్టార్స్ ఎవరు కూడా ఈ మూడు నెలలు ముందుకు రాలేదు.

దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరంగా ఉన్న హీరోలు హీరోయిన్స్ మెల్లగా షూటింగ్స్ కు హాజరు అవుతున్నారు.

కరోనా భయం ఇంకా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొనాలంటూ నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే హీరోయిన్స్ వారి సొంత ప్రాంతాల నుండి హైదరాబాద్ కు ఒక్కరు ఒక్కరుగా వచ్చేశారు. ఇంకా వస్తూనే ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కీర్తి సురేష్ ల్యాండ్ అయ్యింది. సింపుల్ లుక్ లో కీర్తి కనిపించింది.

మాస్క్ ధరించి.. చేతులకు గ్లౌజ్ లు పెట్టుకుని వైట్ టీ షర్ట్ మరియు బ్లాక్ పాయింట్ ను ధరించి బ్లాక్ షూ వేసుకుని సింగిల్ గా నడుచుకుంటూ కీర్తి సురేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించి అక్కడున్న వారి కెమెరాకు చిక్కింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆమె ఏ సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చింది అనే విషయంపై క్లారిటీ లేదు.

త్వరలో ఆమె ఏదో ఒక షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/