కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

BRS-mlc-kavitha-bail-petition-rejected-by-rouse-avenue-court
BRS MLC Kavitha judicial remand extend to May 20

న్యూఢిల్లీః మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం పొడిగించింది. మే 20వ తేదీ వరకు ఆమె రిమాండ్‌ను పొడిగించింది. ఈడీ అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీటును దాఖలు చేశారు. దీంతో ఆమె రిమాండును పొడిగించింది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై మే 20న విచారణ జరగనుంది. ఈడీ కేసులో నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. మద్యం పాలసీ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని… కాబట్టి ఆమె రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.