సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట విడాకులు

చిత్రసీమలో ప్రేమ , పెళ్లిళ్లు ఎంత కామనో ..విడిపోవడం కూడా అంతే కామన్. ఇప్పటికే ఎంతోమంది సినీ జంటలు విడిపోగా..ఇప్పుడు మరో జంట విడిపోయారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ తన భార్య, సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో జీవీ ప్రకాష్, సైంధవి ఒకే పోస్ట్ పెట్టారు. ఈ మేరకు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కాగా జీవీ ప్రకాష్.. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సైంధవిని 2013లో ప్రేమించి పెళ్లి చసుకున్నాడు. ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది.

” చాలా ఆలోచించిన తర్వాత సైంధవి, నేను 11 ఏళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాము. వివాహం, మన మానసిక ప్రశాంతత కోసం, మా ఇద్దరి లైఫ్‌లు మెరుగవటం కోసమే పరస్పర గౌరవంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అందువల్ల ఇలాంటి సమయంలో మీడియా మిత్రులు, అభిమానులను దయతో అడుగుతున్నాము.. మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని గౌరవించాలని కోరుతున్నాము. మేము విడిపోతున్నాము. ఇది కరెక్ట్ నిర్ణయమే అని మేము నమ్ముతున్నాము. ఇది ఒకరికొకరు ఉత్తమ నిర్ణయం. మీ అవగాహన, ఈ కష్ట సమయంలో మద్దతు చాలా అవసరం”అంటూ జీవీ ప్రకాష్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.