ధర్మవరంలో హీరోయిన్ నమిత ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా నడుస్తుంది. అధికార – కూటమి పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి కూడా సినీ ప్రముఖులు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిల్చున్న పిఠాపురం లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు.

ఇదే క్రమంలో నటి నమిత సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ నేత సత్య కుమార్ కు మద్దతుగా సినీ నటి బీజేపీ మహిళా నేత నమిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి దేవి దేవాలయంలో నమిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మవరం పట్టణంలో నమిత రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గం లోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నమిత కొనసాగుతున్నారు. చెన్నైలో కూడా లోక్‌సభ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు.