హైదరాబాద్ లోని OYO హోటల్‌ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ మహానగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ లోని చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న 8 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.

పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థత నెలకొంది. దీంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.