ఈడీ ఆఫీస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 11 న మొదటిసారి ఈడీ ఎదుట హాజరుకాగా, దాదాపు 09 గంటల పాటు విచారించడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 16 న రెండో సారి హాజరుకావాల్సి ఉండగా..కవిత హాజరుకాలేదు. ఈ తరుణంలో నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. దీంతో ఈరోజు ఈడీ ఎదుట హాజరైంది.

ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్‌, సోదరుడు, మంత్రి కేటీఆర్‌ , ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ , వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసానికి చేరుకున్నారు. విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏం చెప్పాలి? అసలు విచారణకు హాజరు కాకపోతే పరిస్థితి ఏంటి? అనే అంశాలపై రాత్రి వీరంతా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.