చంద్రబాబుకు ఇవే ఆఖరి విజయోత్సవాలు – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేయడం తో ఆ పార్టీ శ్రేణులను సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలతో వైస్సార్సీపీ ఓటమి మొదలైందని , రాబోయే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా వైస్సార్సీపీ నేతలు మాత్రం ఇదే ఆఖరి ఫలితాలు మీకు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ ఫలితాలపై ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు స్పందించగా..తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే చంద్రబాబు గొప్పగా ఫీల్ అవుతున్నారని… ఇక తనకు తిరుగులేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి విజయోత్సవాలు అని, 2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని కాకాణి అన్నారు. మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని… ఆయనకు గోకర్ణ, గజకర్ణ విద్యలన్నీ తెలుసని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు కాపాడటానికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని చెప్పారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని… తమ ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యల పట్ల తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు.