ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ..

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తుంది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న టీడీపీ.. మూడో స్థానంలో కూడా విజయం సాధించినట్లు తెలుస్తుంది. ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి 5 వేల పైచిలుకు మెజారీటీతో గెలుపొందారని సమాచారం.

ఇక ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వైస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం నినాదాలు చేస్తుంటే.. వైస్సార్సీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.