ఓట్ల లెక్కింపుపై మంత్రి కెటిఆర్‌ ఆరా!

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు విధానం, ఆధిక్యం వంటి పలు అంశాలపై మంత్రి కెటిఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దూసుకుపోతుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న కౌంటింగ్ లో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 10గంటల వరకు జరిగిన కౌంటింగ్ లో పెద్దపల్లి, వర్ధన్నపేట, మహబూబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. తుది ఫలితాల అనంతరం సాయంత్రం టిఆర్‌ఎస్‌ ఎంపిలు, ఎంఎల్సిలతో మంత్రి కెటిఆర్ భేటీ కానున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/