పార్టీకోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయి
విలువలు, మంచిపేరే కలకాలం ఉంటాయన్న చంద్రబాబు నాయుడు

అమరావతి: టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయన్నారు. పార్టీలో పోరాడే వాళ్లకే పెద్దపీట ఉంటుందని వారికి సముచితం స్థానం కల్పిస్తామని తెలిపారు. విలువలు, మంచిపేరే కలకాలం ఉంటాయన్నారు. కౌన్సిల్లో యనమల ధ్వజస్తంబం మాదిరిగా నిలబడ్డారు. టిడిపి ఎమ్మెల్సీలంతా కోటగోడగా నిలబడ్డారన్నారు. ప్రజలు ఒక్కసారే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలో మోసపోయారని మళ్లీ..మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని చంద్రబాబు అన్నారు. ప్రజల గుండెల్లో టిడిపిని తుడిచేయడం అసాధ్యంమన్నారు. కాగా 1984లో టిడిపి పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఆ అవకాశం వచ్చింది. విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారు. 1984 పోరాటం గుర్తు చేసిన ఎమ్మెల్సీలకు అభినందనలు. బెదిరింపులకు భయపడితే కనుమరుగవుతారని చంద్రబాబు అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/