ఎఫ్ 3 ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో వెంకటేష్ చిత్ర ట్రైలర్ కు సంబదించిన డబ్బింగ్ ను పూర్తి చేసాడు.

ట్రైల‌ర్ కు డ‌బ్బింగ్ పూర్తయిందని చెప్పేందుకు చాలా ఎక్జ‌యిటింగ్‌గా ఉంద‌ని వెంకీ ట్వీట్ చేశాడు. డ‌బ్బింగ్ స్టూడియోలో వెంకీ ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్టో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ క్రేజీ మూవీలో త‌మ‌న్నా, మెహ‌రీన్, సోనాల్ చౌహాన్‌, అంజ‌లి, సునీల్‌, అన్న‌పూర్ణ‌మ్మ, వెన్నెల కిశోర్, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజాహెగ్డే స్పెష‌ల్ సాంగ్ లో మెర‌వనుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఎఫ్ 3 లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతుండడం తో అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.