రాష్ట్రంలో భారీగా ఏసీపీ అధికారుల బదిలీ

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోని అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలువుర్ని బదిలీ చేసిన సర్కార్..తాజాగా ఏసీపీ అధికారులను డీజీపీ బదిలీ చేశారు. 61 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.