కాంగ్రెస్ గూటికి భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే..?

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరి..ఇప్పుడు ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుడడంతో మరోసారి బిఆర్ఎస్ నుండి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. రీసెంట్ గా పట్నం మహేందర్ , అయన భార్య తో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరగా..ఇప్పుడు భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధం అయ్యాడనే వార్తలు విన్పిస్తున్నాయి.

ఇప్పటికే మంత్రి పొంగులేటితో పాటు ఇతర ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపారా. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఆయన.. సీటు రాకపోవడంతో తిరిగి BRSలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ సొంత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యారు.