22న మంగళగిరిలో జనసేన పార్టీ..

ఈ నెల 22 న మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశం జరగనుంది. పవన్ కళ్యాణ్ అధ్యక్షత ఈ సమావేశం జరగనుంది. జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారంపై పవన్ కళ్యాణ్ నేతలతో , కార్య కర్తలతో సమీక్ష చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతాంగం, పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై చర్చించనున్నారు.

రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలు, అక్టోబర్ 5న ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన కు సంబదించిన పలు విషయాలను తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు.