లాక్డౌన్ నిబంధనలు సడలించలేం
వైరస్ గొలుసును తెంపలేకపోతున్నాం..గ్రీన్ జోన్లలో ఉన్న వారు బయటకు రావాలి

ముంబయి: కరోనా మహమ్మారి మహరాష్ట్రలో విజిృభిస్తుంది. మరణాలతో దేశంలోనే ఈ రాష్ట్రం ముందుంది. రోజూ వందల సంఖ్యలో ఇక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే కరోనా లాక్డౌన్ నిబంధనల సడలింపు అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ..రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. లాక్డౌన్ వల్ల వైరస్ను నియంత్రించగలిగినా.. దాని గొలుసును విడగొట్టలేకపోతున్నామని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ తెలిపారు. ఇందులో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు.మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కూలీలు స్వగ్రానికి వెళ్లిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు స్థానికులు బయటకు రావాలని ఉద్ధవ్ కోరారు. గ్రీన్జోన్లో ఉన్నవారు దయచేసి బయటకు రావాలని, పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్న సిఎం ప్రధాని మోడి షలో అభ్యర్థిస్తున్నానని, ఆత్మనిర్భర్ భారత్ కావాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/