జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం నిధులు విడుద‌ల

YouTube video
Hon’ble CM of AP will be Disbursing Interest Free Loans to Street Vendors Under Jagananna Thodu LIVE

అమరావతి: సీఎం జగన్ జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈసందర్భంగా తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిధులు విడుద‌ల చేసిన సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… పూర్తి వ‌డ్డీ భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. చిరు వ్యాపారుల‌కు రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద 5,10,462 మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526.62కోట్లు జ‌మ అయ్యింద‌న్నారు. ఒక్కొక్క‌రికి రూ.10వేల రుణం అందిస్తున్న‌ట్లు తెలిపారు. వ‌డ్డీలేని రుణం రూ.510.46కోట్లు అన్నారు. వ‌డ్డీ రీయింబ‌ర్స్ మెంట్ రూ.16.16కోట్లు అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/