తీవ్ర తుపానుగా మారానున్న ‘అంప్‌న్‌’

cyclone

అమరావతి: పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘అంప్‌న్‌’ ‌ పెను తుపాను కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.‌ గత ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా అది పయనించింది. పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కిలోమీటర్లకు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. రేపు మధ్యాహ్నం బెంగాల్‌బంగ్లాదేశ్ తీరం హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారి తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. తుపాను తీరం దాటే సమయానికి గంటకు 165 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని వివరించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/