ప్రచారం చివరి రోజు హోరెత్తించాలి

పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కెటిఆర్‌ సూచన

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: పుర, నగరపాలక ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. చివరి రోజు ప్రచారం హోరెత్తాలని, సభలు, సమావేశాలు, పాదయాత్రలు, రోడ్డుషోలతో ప్రతి ఇంటికి పారీ సందేశం చేరేలా కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సూచించారు. మంతుల నుంచి కార్యకర్తల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఆయన పార్టీ నాయకులకు సందేశాలిచ్చారు. సోమవారం తో ప్రచారం ముగుస్తోంది. ఇప్పటివరకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చివరిరోజును కూడా సద్వినియోగం చేసుకోవాలి. కాలనీల్లో పాదయాత్రలు నిర్వహించండి. పార్టీ నేతలు సమన్వయంతో కార్యక్రమాలను రూపొందించాలి, ఎమ్మెల్యెల ఆధ్వర్యంలో ప్రణాళికలు అమలు జరపండి. సామాజిక మాధ్యమాలను సైతం విస్తృతంగా వినియోగించుకోవాలి. ప్రతిపక్షాల విషప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని చెప్పారు. పురపాలక సంఘాల వారీగా ప్రచార శైలిపై నివేదిక రూపొందించాలని సవన్వయకర్తలకు కెటిఆర్‌ సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/