ఫేస్‌బుక్‌పై నాన్సీపెలోసి విమర్శలు

Nancy Pelosi
Nancy Pelosi

అమెరికా: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ వ్యవహార తీరు సిగ్గు చేటు అని అమెరికా పార్లమెంట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి విమర్శించారు. ఫేస్‌బుక్‌ అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి ఆయనను బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ధనార్జనే ఫేస్‌బుక్‌ లక్ష్యంగా ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా రష్యా నుండి వచ్చిన సొమ్ము గురించి దాచిపెట్టింది. బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది అని పెలోసి ఫేస్‌బుక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. పెలోసి వ్యాఖ్యలపై ఫేస్‌బుక్‌ స్పందించాల్సి ఉంది. ప్రతి వారం నిర్వహించే మీడియా సమావేశంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సాంకేతికత ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఫేస్‌బుక్‌ దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/